News February 10, 2025

హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డు: హరీశ్ రావు

image

తెలంగాణ గ్రోత్ ఇంజన్ అయిన హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుగా నిలిచిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’లో విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేల్ కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. మొన్న కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి సూసైడ్, నేడు ఆదిభట్లలో నరసింహ గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమన్నారు.

Similar News

News April 14, 2026

జనగామ: 94 మంది పంచాయతీ సెక్రటరీల బదిలీ

image

జనగామ జిల్లా వ్యాప్తంగా 94 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన సెక్రటరీలు తమ కొత్త నియామక స్థానాల్లో 24 గంటల్లోపు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. గ్రామ పరిపాలనలో పారదర్శకత, పనితీరు మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఒకేసారి ఇంత భారీగా బదిలీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

News April 14, 2026

మాస్టర్ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలి: శైలజా రామయ్యర్

image

కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతి అంత్య పుష్కరాల పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తాత్కాలిక పనులను 15 రోజుల ముందే పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులకు టెండర్లు పిలవాలని, పూర్తయిన వాటికి నిధులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు.

News April 14, 2026

గుడ్‌న్యూస్ చెప్పిన LIC

image

ప్రభుత్వ బీమా సంస్థ LIC తమ ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. 1:1 నిష్పత్తిలో బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపింది. రికార్డు తేదీ నాటికి వాటాదారులు కలిగి ఉన్న ప్రతి షేరుకు అదనంగా ఉచిత షేరును ఇవ్వనుంది. అంటే మీ వద్ద 100 షేర్లు ఉంటే బోనస్ తర్వాత అవి 200 షేర్లు అవుతాయి. రికార్డ్ డేట్‌ను త్వరలో ప్రకటించనుంది. 2022 మే నెలలో స్టాక్ మార్కెట్లో LIC లిస్ట్ అయింది.