News April 11, 2025

హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్ 

image

ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ 15 శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను చర్చించినట్లు తెలిసింది. 

Similar News

News February 7, 2026

ANU: పీజీ ఆర్ట్స్, సైన్స్, లా పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన పలు పీజీ కోర్సుల మూడో సెమిస్టర్, లా కోర్సుల పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు ఈనెల 16వ తేదీలోగా అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.

News February 7, 2026

ANU: బీఆర్క్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు ఈ నెల 16వ తేదీలోగా అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.

News February 7, 2026

గుంటూరు: అంబటి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

image

CMని దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్, అలాగే ఆయనకు బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ తరపు న్యాయవాదులు కోరిన పిటిషన్లపై గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రాసిక్యూషన్ తరపున డీడీ విజయలక్ష్మి, అంబటి తరపున పొన్నవోలు తమ వాదనలు వినిపించారు.