News August 15, 2024

హైదరాబాద్: అమానుష ఘటన

image

శంషాబాద్‌లో మైనర్ బాలికపై కృష్ణారెడ్డి అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. బాలిక గర్భవతి కావడంతో కొత్తూరులోని ఓ క్లినిక్‌లో 5 నెలల గర్భాన్ని తొలగించుకున్నారు. పసిగుడ్డును బజారున పడేశారు. అబార్షన్ చేసిన వైద్యుడు రంజిత్ పరారీలో ఉన్నాడు. రోడ్డు మీద పడేసిన శిశువు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రంజిత్‌పై కేసు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News November 2, 2025

BREAKING: HYD: నవీన్ యాదవ్‌పై కేసు నమోదు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. BRS పార్టీ కేడర్‌ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. BRS కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.

News November 2, 2025

HYD: TRPలో చేరికలు

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)లో సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈరోజు చేరారు. అడ్డగుట్ట మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు TRPలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి భావన రఘు సమక్షంలో వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నిబద్ధత, అంకితభావంతో కృషి చేయాలని మల్లన్న కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

News November 2, 2025

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 46% పనులు పూర్తి: కిషన్ రెడ్డి

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకుంటోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం రూ.714.73 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 46 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ‘X’ వేదికగా వెల్లడించారు.