News August 16, 2024

హైదరాబాద్ అమ్మాయిని అభినందించిన రాష్ట్రపతి

image

12 ఏళ్ల వయసులోనే అనాథాశ్రమాలు, స్కూళ్లలో సొంతంగా లైబ్రరీలను ఏర్పాటు చేసిన HYDకు చెందిన ఆకర్షణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్ ఆహ్వానం మేరకు 15న న్యూఢిల్లీలో జరిగిన ఎట్ హోమ్ రిసెప్షన్‌లో పేరెంట్స్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇతరులకు విద్యాజ్ఞానం అందిస్తున్న ఆకర్షణను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ప్రెసిడెంట్ సూచనతో మరింత ముందుకెళ్తామని ఆకర్షణ తెలిపారు.

Similar News

News November 21, 2025

హైదరాబాద్ కలెక్టరేట్లో పానీ పరేషాన్

image

హైదరాబాద్ కలెక్టరేట్లో నీటి సమస్య నెలకొంది. నిత్యావసర పనులకూ నీరు లేక సిబ్బంది విలవిల్లాడుతున్నారు. పది రోజులుగా ఈ సమస్య నెలకొంది. పైప్‌లైన్ సమస్య కారణంగా నీటి ఇబ్బంది నెలకొంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక మంది సమస్యలతో కలెక్టరేట్‌కు వస్తుంటారు. ఇందులో నీటి సమస్య ఉండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News November 21, 2025

HYD: లిటిల్ ఇంగ్లండ్ ఎక్కడో తెలుసా?

image

HYDలో ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచే ఓ ప్రాంతం ఉందని మీకు తెలుసా? ఈ ఏరియా ఆంగ్లో- ఇండియన్‌ నివాసస్థలాల ప్రధాన కేంద్రంగా ఉండేది. బ్రిటిష్‌ జీవనశైలి, ఇంగ్లిష్‌ సంప్రదాయాల స్పష్టమైన ముద్రతో ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. వలస యుగపు సంస్కృతి ప్రతి వీధిలో ప్రతిధ్వనించేది. HYD సామాజిక రూపకల్పనలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. అదే సౌత్ లాలాగూడ. అందుకే దీనిని ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచేవారు.