News August 16, 2024

హైదరాబాద్ అమ్మాయిని అభినందించిన రాష్ట్రపతి

image

12 ఏళ్ల వయసులోనే అనాథాశ్రమాలు, స్కూళ్లలో సొంతంగా లైబ్రరీలను ఏర్పాటు చేసిన HYDకు చెందిన ఆకర్షణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్ ఆహ్వానం మేరకు 15న న్యూఢిల్లీలో జరిగిన ఎట్ హోమ్ రిసెప్షన్‌లో పేరెంట్స్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇతరులకు విద్యాజ్ఞానం అందిస్తున్న ఆకర్షణను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ప్రెసిడెంట్ సూచనతో మరింత ముందుకెళ్తామని ఆకర్షణ తెలిపారు.

Similar News

News September 10, 2024

HYD: టీవీవీపీ ఆస్పత్రుల్లోని సిబ్బందికి జీతాలు చెల్లించాలి

image

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, ఇతర సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే సీఎంకు వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. టీవీవీపీ ఆసుపత్రుల్లోని సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.

News September 10, 2024

HYD: వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ ఏర్పాటుకు 3 ప్రాంతాల పరిశీలన

image

HYD శివారులో రానున్న ప్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్లాన్‌లు రూపొందిస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో మన HYDలోనూ సెంటర్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసక్తి చూపినట్లు వారు తెలిపారు. ఇందుకు 3ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు 70 ఎకరాల స్థలం అవసరమని భావిస్తున్నారు.

News September 10, 2024

HYD: గండిపేట చెరువులో భారీ చేప (PHOTO)

image

ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు గండిపేట చెరువు నిండుకుండలా మారింది. దీంతో జాలరులు చేపల వేట కొనసాగిస్తున్నారు. సోమవారం మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కి చెందిన కొంతమంది చేపల వేటలో పడ్డారు. దాదాపు 12 కిలోలకు పైగా చేప వలకు చిక్కింది. ఇది తెలుసుకున్న యువత గాళాలు వేసి చేపలు పట్టేందుకు ఆసక్తి చూపించారు.