News August 17, 2024
హైదరాబాద్ అమ్మాయిని అభినందించిన రాష్ట్రపతి

12 ఏళ్ల వయసులోనే అనాథాశ్రమాలు, స్కూళ్లలో సొంతంగా లైబ్రరీలను ఏర్పాటు చేసిన HYDకు చెందిన ఆకర్షణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్ ఆహ్వానం మేరకు 15న న్యూఢిల్లీలో జరిగిన ఎట్ హోమ్ రిసెప్షన్‌లో పేరెంట్స్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇతరులకు విద్యాజ్ఞానం అందిస్తున్న ఆకర్షణను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ప్రెసిడెంట్ సూచనతో మరింత ముందుకెళ్తామని ఆకర్షణ తెలిపారు.
Similar News
News December 3, 2025
ఓపెన్ కాని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓపెన్ చేస్తే గేమింగ్ సైట్‌కు రీడైరెక్ట్ అవుతోందని అధికారులు వెల్లడించారు. సమస్యపై ఐటీ నిపుణులు పని చేస్తున్నారు. పూర్తిస్థాయి పునరుద్ధరణకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని సైబర్ క్రైం డీసీపీ సుధీంద్ర తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News December 2, 2025
ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా: సీఎం

ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎంతో మంది ఉద్దండులను అందించిన ఓయూని కేసీఆర్ కాల గర్భంలో కలిపేశారు. యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతైనా ఖర్చు చేస్తా’ అని చెప్పారు. కాగా ఇప్పటికే ఓయూని సందర్శించిన రేవంత్ రెడ్డి భారీగా నిధులు కేటాయిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
News December 2, 2025
HYD: సర్పంచ్ ఎన్నికలే లక్ష్యం.. టీబీజేపీ దూకుడు

రాష్ట్రంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో 1000 సీట్లు గెలవాలని టీబీజేపీ TBJP లక్ష్యంగా పెట్టుకుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఓటమి తర్వాత, పార్టీ ఈ వ్యవస్థీకృత కార్యాచరణను ప్రారంభించింది. ఈ ఎన్నికల ఖర్చును పూర్తిగా సిట్టింగ్, గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులే భరించాలని ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతాన్ని, నాయకత్వాన్ని బలోపేతం చేయడమే ఈ వ్యూహం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి.


