News March 8, 2025
హైదరాబాద్ అమ్మాయి.. నీ ప్రతిభకు సలాం

HYD పేరు నిలబెడుతోందీ ఈ సింగర్. ఆధ్యాత్మిక పాటలతో సంగీత ప్రియులను కట్టిపడేస్తూ దేశ, విదేశాల్లో 650 పైగా కల్చరల్ ఈవెంట్లలో పాల్గొంది. 9 ఏళ్ల వయసులోనే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్లో 17 కీర్తనలతో అల్బమ్ విడుదల చేసింది. తన ప్రతిభతో ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో పేరుతెచ్చుకుంది. బర్కత్‌పురాలో ఉండే వివేక్ ఆనంద్, సుచిత్ర దంపతుల కుమార్తెనే ఈ మాళవిక ఆనంద్. ఓ మగువా నీ ప్రతిభకు సలాం.
HAPPY WOMEN’S DAY
Similar News
News October 17, 2025
జూబ్లీలో నామినేషన్లు ఎక్కువైతే ఏం చేద్దామంటారు?

జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా అధికారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. నామినేషన్లు పరిమిత సంఖ్యలో వస్తాయనుకుంటే వాటి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో అధిక సంఖ్యలో వస్తే ఏం చేయాలనేదానిపై అధికారులు సమాలోచనలో పడ్డారు. 407 పోలింగ్ స్టేషన్లుండగా వాటికి 569 ఈవీఎంలు, 569 కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశారు. ఉపసంహరణలు ముగిసిన తర్వాతే పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు.
News October 17, 2025
HYD: మా వైపే జనం: BRS

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో BRS, కాంగ్రెస్ మధ్య <<18031896>>రాజకీయం రసవత్తరంగా<<>> మారింది. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జోష్.. BRSలో చేరుతున్న అన్ని పార్టీల లీడర్లు, క్యాడర్.. విజయం వైపు దూసుకెళ్తున్న BRS అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్.. KCR పాలననే బాగుండే అని ప్రజలు అంటుర్రు.. కాంగ్రెసోళ్లు ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు.. జూబ్లీహిల్స్‌లో కారుదే విజయం’ అని BRS Xలో ట్వీట్లు చేసింది.
News October 17, 2025
HYD: రాసిపెట్టుకో.. కారు పర్మినెంట్‌గా ఫాంహౌస్‌కే: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా మారింది. ‘పదేళ్ల విధ్వంసానికి రెండేళ్ల అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది KTR!.. నువ్వు ఎంత తిమ్మిని బమ్మి చేసినా మీ BRSను జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరు. మీ సానుభూతి డ్రామాలు నమ్మి మోసపోయే స్థితిలో ఇక్కడి జనం లేరు.. ఈ ఎన్నిక తర్వాత మీ కారు ఇక శాశ్వతంగా ఫాంహౌస్‌కే.. రాసిపెట్టుకో!!’ అని Xలో Tకాంగ్రెస్ ట్వీట్ చేసింది.