News May 13, 2024

హైదరాబాద్‌: ఏ బాబు లెవ్.. బయటకురా!

image

HYD-ఉమ్మడి రంగారెడ్డిలో మరికాసేపట్లో పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు HYDలో 29.47%, మల్కాజిగిరిలో 37.69%, సికింద్రాబాద్ 34.58%, చేవెళ్ల 45.35%, కంటోన్మెంట్‌ బై పోల్‌లో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. మన రాజధాని‌ పరువు పోయేలా అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైంది. పాతబస్తీలో ఏకంగా ఇంటి తలుపులు కొట్టి మరీ ఓట్ల వేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇక సమయం లేదు. హైదరాబాదీ ఇకనైనా బయటకురా. SHARE IT

Similar News

News October 7, 2024

HYD: ఏపీ సీఎం CBNను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

image

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు శుభలేఖను అందజేసి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.

News October 7, 2024

HYD: మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనా?: కేటీఆర్

image

సోషల్ మీడియాలో ఎల్లప్పడూ యాక్టివ్‌గా ఉంటూ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు MLA KTR. నిత్యం ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. ట్వీట్‌లు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ బడ్జెట్‌పై X వేదికగా తాజాగా స్పందించారు. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె కావాలి అన్నట్టుంది ప్రభుత్వ వైఖరి అంటూ రాసుకొచ్చారు.

News October 7, 2024

HYD: మంత్రి తుమ్మల తీపికబురు

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో వేస్తామని మంత్రి వెల్లడించారు. సోమవారం గాంధీభవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణలో రుణమాఫీ హామీ అమలు కాలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.