News August 10, 2024

హైదరాబాద్: గ్రేటర్‌లో గ్రెయిన్ ఏటీఎంలు

image

రేషన్ కష్టాలను తీర్చేందుకు గ్రేటర్ పరిధిలో గ్రెయిన్ ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. 24 గంటలపాటు 365 రోజులు రేషన్ పొందేందుకు వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏటీఎం 5 నిమిషాల్లో 50 కిలోల బియ్యం పంపిణీ చేస్తుంది. గంటకు 0.6 వాట్స్ విద్యుత్తు శక్తి అవసరమవుతుంది. సౌర విద్యుత్తుతోనూ నడిచే అవకాశం ఉండడంతో సౌర ప్యానెళ్లు బిగిస్తే 24 గంటలూ లబ్దిదారులకు అందుబాటులో ఉంటుంది.

Similar News

News November 28, 2025

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్రముఖులు

image

ఉజ్వల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్, యుఏఈ రాజ కుటుంబ సభ్యుడు షేక్ తారిక్ అల్ ఖాసిమీ, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్‌తో పాటు ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు హాజరుకానున్నారు.

News November 28, 2025

ట్రాఫిక్ చలాన్లపై నివేదిక ఇవ్వాలని హోంశాఖకు హైకోర్టు నోటీసులు

image

ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసిన విధానంపై హైకోర్టు సీరియస్ అయింది. మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి చలాన్ వేస్తున్నారని నగరవాసి రాఘవేంద్ర చారి పిటిషన్ దాఖలు చేశారు. తనకి 3 చలాన్లు వేశారని, ట్రాఫిక్ పోలీసులు సొంత మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్ ఎన్ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక ఇవ్వాలని, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

News November 28, 2025

కోకాపేట భూములు అ‘ధర’గొట్టాయి!

image

​HYDలోని కోకాపేటలో నవంబర్ 28న జరిగిన భూముల ఈ-వేలంలో భారీ మొత్తంలో ధరలు నమోదయ్యాయి. నియోపోలిస్, గోల్డెన్ మైల్ ఏరియాల్లోని 15, 16 నంబర్ ప్లాట్లకు ఈ వేలం జరిగింది. ​ఈ వేలంలో ఒక్కో ఎకరం ₹140 కోట్లు చొప్పున పలికింది. ఈ 2 ప్లాట్లకు కలిపి మొత్తం ₹1268 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట భూములకు వచ్చిన ఈ ధరలు రికార్డు సృష్టించాయి.