News January 31, 2025
హైదరాబాద్ చరిత్రలో నేడు కీలకం!

హైదరాబాద్ అభివృద్ధిలో నేడు కీలకం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. గోషామహల్లో ఉదయం 11.40 గంటలకు CM రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో గోషామహల్లోని పోలీస్ గ్రౌండ్స్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు.
Similar News
News November 8, 2025
HYD: ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణ

నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్, హెల్త్ సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదిత ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎ.విమలా రెడ్డి తెలిపారు. ఫైర్, ఇండస్ట్రీయల్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎన్విరాన్మెంట్ కోర్సులో మాస్టర్ డిప్లొమాలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
News November 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: రేపు సాయంత్రం నుంచి ప్రచారం బంద్

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. EC నిబంధనల ప్రకారం సాయంత్రం తర్వాత మైకులు బంద్ చేయాలి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ కూడా మూతబడనున్నాయి. నవంబర్ 11న పోలింగ్ ఉండడంతో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గెలుపు ఓటముల్లో పోల్ మేనేజ్మెంట్ కీలకం కానుంది.
News November 8, 2025
HYD: ముఖ్యమంత్రి ప్రజావాణిలో 285 దరఖాస్తులు

బేగంపేటలోని ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణిలో మొత్తం 285 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 154, రెవెన్యూకు 25, హోం శాఖకు 17, ఇందిరమ్మ ఇళ్ల కోసం 59, ప్రవాసి ప్రజావాణికి 1 దరఖాస్తు, ఇతర శాఖలకు సంబంధించి 29 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ జీ.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వెల్లడించారు.


