News January 31, 2025

హైదరాబాద్‌ చరిత్రలో నేడు కీలకం!

image

హైదరాబాద్‌ అభివృద్ధిలో నేడు కీలకం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా‌ ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. గోషామహల్‌లో ఉదయం 11.40 గంటలకు CM రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో గోషామహల్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 26 ఎక‌రాల్లో 2 వేల ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో‌ ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు.

Similar News

News February 15, 2025

HYDలో పెరిగిన 100 వాటర్ ట్యాంకర్లు

image

గ్రేటర్ HYD మహానగర వ్యాప్తంగా వాటర్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా 100 ట్యాంకర్లను కొత్తగా జలమండలి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీంతో ట్యాంకర్ల సంఖ్య 949కి చేరింది. ప్రస్తుతం 78 ఫీలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరో 126 ఫీలింగ్ పాయింట్లు ఉన్నాయి. తాజాగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్ పెరిగినట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

News February 14, 2025

HYD: కుంభమేళా టూర్.. యువకుడి మృతి (PHOTO)

image

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు బయలుదేరిన రంగారెడ్డి జిల్లా వాసులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌కు చెందిన వనం సంపత్ రాణా, వనం శ్రీనివాస్, చంద్రశేఖర్, రమేశ్, సాయి కారులో బయల్దేరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ శివారులో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో <<15456821>>సంపత్ రాణా<<>> అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. మృతుడి ఫైల్ ఫొటో పైన చూడొచ్చు.

News February 14, 2025

గచ్చిబౌలిలో ఏసీబీకి పట్టుబడ్డ ఏడీఈ

image

గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ACB అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ కుమార్ పట్టుబడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకు రూ.75వేలు డిమాండ్ చేశారు. వినియోగదారుల నుంచి ఇప్పటికే రూ.25 వేలు తీసుకున్నారు. కాగా, ఈరోజు మరో రూ.50 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ACB అధికారులు పట్టుకున్నారు.

error: Content is protected !!