News January 4, 2025
హైదరాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ జిల్లాలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. వెస్ట్ మారేడ్‌పల్లిలో 11.8℃, గోల్కొండ, సులేమాన్ నగర్ 12.4, లంగర్‌హౌస్ 13.7, చాంద్రాయణగుట్ట 14.1, రియాసత్‌నగర్ 14.5, అంబర్పేట్ 14.7, బహదూర్‌పుర, మోండామార్కెట్ 14.9, కంటోన్మెంట్ ఏరియా 15.2, బండ్లగూడ 15.2, గౌలివాడ 15.3, ఆసిఫ్‌నగర్ 15.4, ముషీరాబాద్ 15.4, యూసుఫ్‌గూడ 16, వెంగళ్రావునగర్ 16, అజంపురా 16.1, ఓయూ 16.2, ఖైరతాబాద్‌లో 16.3గా నమోదైంది.
Similar News
News January 8, 2025
HYD: 2024లో జైళ్లకు 41,138 మంది ఖైదీలు: డీజీ
2024లో వివిధ కేసుల్లో జైలుకు వచ్చిన వారి సంఖ్య భారీగా పెరిగిందని, ఈ ఏడాదిలో 41,138 మంది జైలుకు వచ్చారని ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. HYDలో సౌమ్య మిశ్రా జైళ్ల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. 2024లో హత్యకేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. 2024లో పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు చెప్పారు.
News January 8, 2025
HYD: 100పడకల ఆస్పత్రిగా అమీర్‌పేట్ హెల్త్ సెంటర్: మంత్రి
50 పడకల ఆసుపత్రిగా ఉన్న అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వంద పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి సందర్శించి ఆస్పత్రిలో సర్జరీ వార్డ్, గర్భిణీల వార్డ్, ఫార్మసి, చిన్నపిల్లలకు మందులు ఇచ్చే గది, రిజిస్టర్లను పరిశీలించారు.
News January 8, 2025
HYD: హామీలు అడిగినందుకు అక్రమ కేసులు: హరీష్ రావు
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. అడిగినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచాయని, ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలు డైరీలో ఉన్నాయని అన్నారు.