News May 18, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో ముగిసిన చందు అంత్యక్రియలు
> సికింద్రాబాద్ లో 3.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం
> నగరంలో కురిసిన భారీ వర్షం
> నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు.. ముగ్గురు అరెస్ట్
> వారాసిగూడలో మహిళ మిస్సింగ్
> ఉప్పల్ శిల్పారామంలో నృత్య ప్రదర్శనలు
> వర్షాల నేపథ్యంలో అధికారులతో మేయర్ టెలీ కాన్ఫరెన్స్
> జూబ్లీ బస్టాండ్‌లో మందుబాబు హల్‌చల్

Similar News

News November 27, 2025

గాంధీ భవన్ వైపు రంగారెడ్డి నేతల చూపు

image

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. అయితే రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇంతవరకు అధ్యక్షుడిని నియమించలేదు. ఎందుకు అధ్యక్షా? అని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రశ్నిస్తున్నారు. డీసీసీ చీఫ్ పోస్టు కోసం రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానికేతరుడిని నియమిస్తున్నారని తెలియడంతో పలువురు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఎంపిక వాయిదా పడిందని సమాచారం.

News November 27, 2025

HYD: చేతిరాత బాగుంటుందా? మరెందుకు ఆలస్యం

image

మీ చేతిరాత అందంగా ఉంటుందా? నలుగురూ మీ రాతను మెచ్చుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. చేతిరాత పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైటింగ్ స్కిల్స్‌పై అవగాహన, ఆసక్తి కల్పించేందుకు చేతిరాత పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు స్టీఫెన్ తెలిపారు. పాఠశాలస్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు www.indianolympiads.comలో నమోదు చేసుకోవాలి.

News November 27, 2025

GHMCలో విలీనం.. 2 రోజుల్లో GO?

image

జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేస్తామని సర్కారు ప్రకటించడంతో సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. విలీనానికి సంబంధించి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు (GO) 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా విలీన ప్రక్రియ ముగించాలని సీఎం ఆదేశించారు.