News April 18, 2024
హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

> వారసిగూడ పీఎస్ పరిధిలో బాలుడి మిస్సింగ్
> జూబ్లీ బస్ స్టేషన్లో అగ్నిమాపక అవగాహన డ్రిల్
> పాతబస్తీ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
> ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
> కాచిగూడ రైలు మ్యూజియంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు
> గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని డెడ్ బాడీ లభ్యం
> సెంట్రల్ యూనివర్సిటీలో ABVP, SFI విద్యార్థుల మధ్య ఘర్షణ
> రామంతపూర్లో BRS మీటింగ్
Similar News
News November 11, 2025
HYD: రూ. 2 కోట్లు విలువైన స్మార్ట్ఫోన్ల స్వాధీనం

HYD పోలీసులు వివిధ నగరాల్లో ఫోన్ చోరీల ముఠాను చేధించారు. మొత్తం 31 మంది నిందితులను అరెస్ట్ చేసి, రూ.2 కోట్లు విలువైన స్మార్ట్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ దొంగిలించిన మొబైల్ ఫోన్ల IMEI నంబర్లను మార్చి ఆఫ్రికా దేశాలకు, ముఖ్యంగా సౌత్ సూడాన్కు రవాణా చేస్తూ విస్తృతంగా అక్రమ రవాణా జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ సైబరాబాద్, హైదరాబాద్ మధ్య జరిగింది.
News November 11, 2025
HYD: మరో 10 రాష్ట్రాలకు విస్తరించనున్న సింగరేణి

సింగరేణి కంపెనీ 10 రాష్ట్రాలకు కార్యకలాపాలను విస్తరించి, సింగరేణి గ్రీన్ ఎనర్జీ, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ ద్వారా 5,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థగా మారనుందని HYDలో ఎండీ బలరాం వెల్లడించారు. 40,000 మంది ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆధారపడి ఉన్న సింగరేణి భవిష్యత్తు శతాబ్దం పాటు సురక్షితంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు.
News November 11, 2025
HYD: గృహ ప్రవేశం.. ఓనర్ను ఘోరంగా కొట్టిన హిజ్రాలు

గృహ ప్రవేశం రోజు యజమానిని హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చీర్యాలలోని బాలాజీఎన్క్లేవ్లో జరిగింది. సదానందం నూతన ఇంటికి వచ్చిన హిజ్రాలు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. యజమాని నిరాకరించగా మరో 15 మందిని వెంట పెట్టుకొచ్చి కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో సదానందం తలకు గాయాలు అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


