News April 18, 2024
హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

> వారసిగూడ పీఎస్ పరిధిలో బాలుడి మిస్సింగ్
> జూబ్లీ బస్ స్టేషన్లో అగ్నిమాపక అవగాహన డ్రిల్
> పాతబస్తీ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
> ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
> కాచిగూడ రైలు మ్యూజియంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు
> గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని డెడ్ బాడీ లభ్యం
> సెంట్రల్ యూనివర్సిటీలో ABVP, SFI విద్యార్థుల మధ్య ఘర్షణ
> రామంతపూర్‌లో BRS మీటింగ్
Similar News
News July 7, 2025
HYD: యుక్త వయసులో మెదడుపై ప్రభావం!

యుక్త వయసులోనే యువత మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఓ వైపు డ్రగ్స్, మద్యం మత్తు, మరోవైపు సైబర్ మోసం, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకోవడంతో ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో తల తిరగడం, ఒళ్లు వణికే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి లక్షణాలు కలిగిన 18 మందికి పైగా ఈ నెలలో ఎర్రగడ్డ, ఉస్మానియా వైద్యులను సంప్రదించడం ఆందోళనకరం.
News July 6, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 105 మందిపై చర్యలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ పరిధిలో పట్టుబడ్డ 105 మందిని నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రూ.2.39 లక్షల జరిమానా విధించబడింది. కొందరికి జైలు శిక్షలు కూడా విధించారు. ఈ చర్యలు ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన పెంపొందించేందుకు చేపట్టినవని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ACP మోహన్ కుమార్ తెలిపారు.
News July 6, 2025
లోకేశ్‌తో KTR పదే పదే చర్చలు: సామ రామ్మోహన్

సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లకు కేటీఆర్ ప్రతిసవాళ్లు విసరడం హాస్యస్పదమని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద రేపు చర్చకు రావాలని KTRకు సవాల్ విసిరారు. రైతుల సంక్షేమంపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. లోకేశ్‌తో కేటీఆర్ పదే పదే రహస్య మంతనాలు జరపడంపై కూడా సమాధానం చెప్పాలని సామ రామ్మోహన్ డిమాండ్ చేశారు.