News September 22, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి ప్రధానాంశాలు

image

> చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో అన్నమయ్య పద సమార్చనం
> బొటానికల్ గార్డెన్ లో బర్డ్ వాక్
> ఉప్పల్‌లోని విశ్వకర్మ ఆత్మగౌరవ భవనంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞమహోత్సవం
> కార్వాన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> తెలంగాణ ఆక్యుపంక్చర్ అక్యుప్రెషర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
బషీరాబాగ్ ప్రెస్ క్లబ్‌లో సెమినార్
> డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

Similar News

News July 10, 2025

ఘట్‌కేసర్: కన్న తండ్రినే హతమార్చింది

image

ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రినే హతమార్చిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ముషీరాబాద్- ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతుల పెద్ద కుమార్తె భర్తతో విడిపోయి వీరి వద్దే ఉంటుంది. మనీషా వివాహేతర సంబంధంపై తండ్రి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా.. ఈనెల 5న ప్రియుడు మహ్మద్ జావీద్‌, తల్లితో కలిసి తండ్రిని చంపేసి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేశారు.

News July 10, 2025

హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం

image

హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిన్నటి వరకు ఐదుగురు మృతిచెందగా.. 31 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కూకట్‌పల్లి PS పరిధిలోని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించిన కెమికల్స్ కలిపిన కల్లు తాగడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఎక్సైజ్ అధికారులు 5 కేసులు నమోదు చేశారు. కాగా కల్లు దుకాణాలపై నిఘా ఉంచాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో విమర్శలు వస్తున్నాయి.

News July 10, 2025

వైభవంగా చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

image

పసుపు కుంకుమల సంగమాన్ని తలపించిన వీధులు.. వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా భజంత్రీలు.. శివసత్తుల నృత్యాలు వెరసి భక్త జన సందోహం నడుమ చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆరెల్లి అంజయ్య దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు. దాతలను ఆలయ కమిటీ ఛైర్మన్ అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు.