News December 6, 2024
హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

హైదరాబాద్ జిల్లా పరిధిలోని బస్తీ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు MBBS పూర్తి చేసిన, అర్హత కల్గిన వారు walk in interviewకు హాజరు కావాలని DMHO డా వెంకటి ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ ప్యాట్ని సెంటర్ GHMC భవనంలోని 4వ అంతస్తులో ఉన్న DMHO కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలని వెల్లడించారు. ఈ సదవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలన్నారు.
Similar News
News November 20, 2025
‘ఇబ్రహీంపట్నం ఎస్సీ బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు’

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం SC బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతిరోజూ అందిస్తోన్న అన్నం సరిగా ఉడకకపోవడం, గింజలు గట్టిగా ఉండటం, రుచి తగ్గిపోవడం, కొన్నిసార్లు తినడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇదొక చిన్న సమస్యగా కాకుండా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశమని, కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.
News November 19, 2025
ప్రణాళికలు సిద్ధం చేసుకుని చీరలు పంపిణీ చేయాలి: రంగారెడ్డి కలెక్టర్

రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకొని పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కొంగరకలాన్లోని కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. చీరల పంపిణీ కార్యక్రమం విషయం స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం అందించి, వారిని తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు.ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
News November 19, 2025
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. అక్రిడియేషన్ కార్డుల జాప్యం, జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50% ఫీజు రాయితీ అమలు చేయకపోవడం, పలు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని ఆందోళనకారులు పేర్కొన్నారు.


