News July 11, 2024

హైదరాబాద్‌: జూ పార్కుకు కొత్త జంతువులు

image

HYDలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కు‌కు కొత్తగా జంతువులు వచ్చాయి. జంతు మార్పిడిలో భాగంగా UP కాన్పూర్‌ నుంచి రాయల్ బెంగాల్ పెద్దపులి(ఆడ)ని తీసుకొచ్చారు. మరో రెండు చిరుత పులుల జంటలు, జింకలు, కొన్ని పక్షులను‌ ‘జూ‌’కు షిఫ్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి కాన్పూర్‌కు‌ కూడా పలు జంతువులను తరలించారు. కాగా, మంగళవారం నుంచి ఆదివారం(8:30AM-4PM) వరకు జూ తెరిచి ఉంటుంది. సోమవారం సెలవు.
SHARE IT

Similar News

News February 18, 2025

BREAKING: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనంతరం కార్గో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

News February 18, 2025

HYD: నేటి నుండి TGCSB షీల్డ్ కాంక్లేవ్

image

నేటి నుంచి 2రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో షీల్డ్ కాంక్లేవ్ 2025 జరగనుంది. సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించే ఆవిష్కరణలపై కాంక్లేవ్‌కు సీఎం రేవంత్, పోలీస్ ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు 1,200 సైబర్ భద్రత నిపుణులు దరాఖాస్తులు చేసుకోగా 590 మందిని TGCSB సెలెక్ట్ చేసింది.

News February 18, 2025

HYD: భార్యను పంపమని ఆమె భర్తనే అడిగాడు..!

image

పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి నిప్పంటించుకున్న ఘటన మధురానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. యాదగిరినగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యకు సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ‘మీ భార్యను నాకు ఇచ్చేయ్, జీవితాంతం సంతోషంగా చూసుకుంటా’అని భర్తతో అన్నాడు. భర్త ఆగ్రహించడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

error: Content is protected !!