News July 11, 2024
హైదరాబాద్: జూ పార్కుకు కొత్త జంతువులు
HYDలోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు కొత్తగా జంతువులు వచ్చాయి. జంతు మార్పిడిలో భాగంగా UP కాన్పూర్ నుంచి రాయల్ బెంగాల్ పెద్దపులి(ఆడ)ని తీసుకొచ్చారు. మరో రెండు చిరుత పులుల జంటలు, జింకలు, కొన్ని పక్షులను ‘జూ’కు షిఫ్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి కాన్పూర్‌కు కూడా పలు జంతువులను తరలించారు. కాగా, మంగళవారం నుంచి ఆదివారం(8:30AM-4PM) వరకు జూ తెరిచి ఉంటుంది. సోమవారం సెలవు. SHARE IT
Similar News
News October 14, 2024
HYD: హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. శాసనమండలి చీఫ్ విప్ నియామకం రాజ్యాంగ బద్ధంగానే జరిగిందన్నారు. సంప్రదాయం ప్రకారమే ప్రతిపక్ష సభ్యుడికి పీఏసీ ఛైర్మన్ హోదా ఇచ్చామని, ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టులో ఉందన్నారు. ఎక్కడా ఉల్లంఘనలు లేవని, అయినా హరీశ్‌రావుకు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని మంత్రి వ్యాఖ్యానించారు.
News October 14, 2024
HYD: మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం: హరీశ్‌రావు
చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంది. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీఫ్ విప్ బాధ్యత. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా.. ప్రతి పక్ష పార్టీ సభ్యులకా’ అని ప్రశ్నించారు.
News October 14, 2024
HYD: అందరికీ ఆదర్శంగా నిలిచిన అక్కాచెల్లెళ్లు..!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం వెంకన్నగూడ గ్రామంలో సాధారణ జీవితం కొనసాగించే బండారి బాలరాజ్, భారతమ్మకు నలుగురు ఆడబిడ్డలు. తమకు ఆడబిడ్డలు ఉన్నారని ఏ మాత్రం దిగులు లేకుండా వారిని మగపిల్లలకు దీటుగా పెంచారు. అందులో ముగ్గురు అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పెద్ద అమ్మాయి పోలీసు, రెండో అమ్మాయి స్టాఫ్‌నర్సు, నాలుగో కూతురు యమున టీచర్ ఉద్యోగం సాధించారు. వారిని గ్రామస్థులు అభినందించారు.