News July 10, 2024
హైదరాబాద్: డిజిటల్ ప్లాన్ సక్సెస్.. తీరనున్న కష్టాలు

TGSRTCలో టికెట్ కొనేవారికి చిల్లర కష్టాలు తీరనున్నాయి. డిజిటల్ చెల్లింపుల విధానం తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బండ్లగూడ డిపోలో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టారు. 70 బస్సుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిజిటల్ పేమెంట్స్ విజయవంతమయ్యాయి. ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ ద్వారా ఫోన్ పే, G pay, Paytm, డెబిట్, క్రెడిట్ కార్డుతోనూ చెల్లింపు చేయవచ్చు. SHARE IT
Similar News
News October 27, 2025
HYD: సిట్టింగ్ స్థానం కోసం BRS అడుగులు

జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు BRS అడుగులు వేస్తుంది. 3 పర్యాయాలు ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ స్థానం ఎట్టి పరిస్థితిలో చేజారకుండా గట్టి ప్రయత్నాలకు దిగింది. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, సెంటిమెంట్ను నమ్ముకుని రంగంలోకి దిగింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్ట నున్నారో వేచి చూడాల్సిందే.
News October 27, 2025
జూబ్లీహిల్స్లో BJP ‘కార్పెట్ బాంబింగ్’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రేపు కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాజస్థాన్ సీఎం, తదితరులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
News October 26, 2025
రంగారెడ్డి: రేపు ‘లక్కీ’గా వైన్స్ దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు TG ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ యూనిట్లో 138 లిక్కర్ షాపులకు 7,761 దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్లో 111 షాపులకు 8,306 మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ.482.01 కోట్ల ఆదాయం సమకూరింది. గ్రేటర్ పరిధిలోని 639 షాపులకు 34,958 దరఖాస్తులు రాగా.. రూ.1048.74 కోట్ల ఆదాయం రావడం విశేషం.


