News November 22, 2024

హైదరాబాద్: డ్రైనేజీ, మంచినీటి సమస్యలేమిటో తెలపండి!

image

జలమండలి ఎండి అశోక్ రెడ్డితో Way2News త్వరలో ఇంటర్వ్యూ తీసుకోనుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ HYD పరిధిలోని ప్రజలు మీ ప్రాంతాల్లో డ్రైనేజీ, మంచినీటి సంబంధిత సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. తాజాగా తీసుకున్న నిర్ణయాలను సైతం ఎండీ వివరించనున్నారు.

Similar News

News March 11, 2025

HYD: ఓయూలో భోజనంలో బ్లేడ్

image

OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్‌లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లో‌కైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.

News March 11, 2025

HYD: పోలీసులను అభినందించిన సీపీ

image

బంగ్లాదేశీ మహిళల అక్రమ రవాణాను అరికట్టి బాధితులను ప్రజ్వల షెల్టర్ హోమ్‌కు తరలించిన ఘటనలో ప్రతిభ కనబరిచిన ఫిలింనగర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పంజాగుట్ట కానిస్టేబుల్ లావణ్యకు HYD సీపీ సీవీ ఆనంద్ రివార్డులు అందజేశారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంలో వీరు చూపిన శ్రద్ధ, అంకితభావాన్ని కొనియాడారు. వీరందరిని పునరావాస కేంద్రానికి తరలించడంలో కీలకపాత్ర పోషించారన్నారు.

News March 11, 2025

HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

image

HYDతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ఠంగా 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. HYDలో మధ్యాహ్నం 2, 3 గం.ల వరకు సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. ఏప్రిల్, మే నెలలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

error: Content is protected !!