News May 11, 2024

హైదరాబాద్ తెలంగాణకు వెన్నెముక: KCR

image

హైదరాబాద్.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ఇక్కడ మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి పెంచాలి కానీ ఉన్న కంపెనీలు పోయేలా కాంగ్రెసోళ్లు చేయొద్దని KCR అన్నారు. పలు పరిశ్రమలు HYD నుంచి తరలివెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. KCRను తిట్టడం బంద్ చేసి తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెసోళ్లు దృష్టి సారించాలన్నారు. ప్రజలకు పనులు చేసి చూపించాలన్నారు. కరెంట్ కోతలతో ఇబ్బంది పెట్టొద్దన్నారు.

Similar News

News January 6, 2026

రంగారెడ్డిలో ‘పేదోడి విందు’ కొండెక్కింది

image

పేదోడి విందైన చికెన్ ధర కొండెక్కడంతో RRజిల్లాలో చికెన్ ప్రియులకు షాక్ తగిలి బెంబేలు ఎత్తుతున్నారు. న్యూ ఇయర్ ప్రారంభంలోనే కిలో చికెన్ ధర త్రిబుల్ సెంచరీకి చేరింది. గత కొన్ని రోజులుగా రూ.200- 250 ఉన్న ధర అమాంతం పెరగడంతో వచ్చే పండుగ ఎలా చేసుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఫారం ధర రూ.180 పలుకుతోంది. వినియోగం పెరిగి, కోళ్ల పెంపకం తగ్గడమే ధర పెరగుదలకు కారణమని ఫారం యజమానులు చెబుతున్నారు.

News January 5, 2026

మొయినాబాద్: 8 నెలలుగా మ్యాథ్య్ టీచర్ లేక 10th విద్యార్థుల ఆందోళన

image

మొయినాబాద్‌లోని హిమాయత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో 8 నెలలుగా గణిత బోధించకపోవడంతో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడుతున్నారు. సిలబస్ పూర్తి కాకుండానే 10వ పబ్లిక్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజు హిమాయత్‌నగర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బురకాయల రమేశ్ 10వ తరగతి విద్యార్థులను సందర్శించి, MEOతో మాట్లాడి ఉపాధ్యాయుని నియమిస్తానని హామీ ఇచ్చారు.

News January 5, 2026

RR: గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేశారా?

image

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నూతన, 6- 9 తరగతుల వరకు మిగిలిన సీట్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు శంషాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి.నాగేశ్వరరావు తెలియజేశారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులన్నారు. ఈ నెల 21లోపు కుల,ఆదాయం, బర్త్ సర్టిఫికెట్, 2 ఫొటోలు తీసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.