News July 31, 2024

హైదరాబాద్‌: పంజాగుట్టలో ACB రైడ్స్

image

నగరంలోని పంజాగుట్ట సర్కిల్ ప్రాంతంలో ACB అధికారులు రైడ్స్ చేశారు. పంజాగుట్ట సర్కిల్ వన్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.2,00,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫైనల్ ఆడిట్ క్లియర్ చేసేందుకు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు రావడంతో‌ రైడ్స్ చేసినట్లు వెల్లడించారు.

Similar News

News December 1, 2025

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఫుట్‌బాల్ స్టేడియాలు

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఫుట్‌బాల్ స్టేడియాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. రెడ్ హిల్స్, కాప్రా, మల్లేపల్లిలో ఈ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికోసం రూ.15 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో టెండర్లను పిలిచే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు.

News December 1, 2025

HYD: ఆన్‌లైన్ బెట్టింగ్‌.. మరో యువకుడు బలి

image

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఉప్పల్‌కు చెందిన సాయి (24) శాంతినగర్‌లో పురుగుల మందు తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతి స్థానికంగా కలకలం రేపింది.

News November 30, 2025

హైకోర్టు: 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

తెలంగాణ రాష్ట్ర జుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్ధతిలో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్టు హై కోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఈ సివిల్ జడ్జిల పోస్టులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ వివరాలను హై-కోర్టు వెబ్‌సైట్ http://tshc.gov.comని సంప్రదించవచ్చు.
SHARE IT