News January 10, 2026

హైదరాబాద్‌: పాలనలో కొత్త అధ్యాయం

image

HYD నగర పాలనలో ఒక భారీ శకం ముగిసి, కొత్త అధ్యాయం మొదలైంది. GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ ఇప్పటికే 100 % పూర్తయింది. లోపల జరగాల్సిన ఫైల్ వర్క్, వార్డుల పునర్విభజన అంతా సైలెంట్‌గా క్లోజ్ చేసేశారు. వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ పాలనాపరమైన కేటాయింపులు కూడా ముగిశాయి. ముగ్గురు సీనియర్ సిటీ ప్లానర్లకు బాధ్యతలు అప్పగిస్తూ GHMC ఉత్తర్వులు జారీ చేయడం విభజన పూర్తయిందనడానికి బలమైన సాక్ష్యం.

Similar News

News January 20, 2026

ఖమ్మం మార్కెట్‌లో ‘మిర్చి’ ఘాటు.. పత్తి ధరకూ రెక్కలు!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వాణిజ్య పంటల ధరలు ఊపందుకున్నాయి. దేశీయంగా డిమాండ్ పెరగడంతో తేజ రకం మిర్చి క్వింటాలు గరిష్ఠంగా రూ.16,300 పలికింది. అటు పత్తి ధర కూడా వారం వ్యవధిలో రూ.1,000 పెరిగి క్వింటాలు రూ.8,000కు చేరడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే సుమారు 30 వేల బస్తాల మిర్చి అమ్మకానికి రాగా, మార్కెట్ ఛైర్మన్ కొనుగోళ్లను పర్యవేక్షించారు.

News January 20, 2026

రేషన్ కార్డు ప్రామాణికంగా ఇందిరమ్మ చీరల పంపిణీ: కలెక్టర్

image

మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పురపాలక సంఘాల్లో మహిళలకు వడ్డీలేని రుణాలు, చీరల పంపిణీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి చీరల పంపిణీని 3 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

News January 20, 2026

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ సీఎం

image

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సంఘాల్లో లేని వారిని రేషన్ కార్డు ఆధారంగా గుర్తించి, పంపిణీలో రద్దీ లేకుండా చూడాలని సూచించారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి కలెక్టర్లు, బ్యాంకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు.