News July 15, 2024
హైదరాబాద్: పోస్టాఫీసులో 115 ఉద్యోగాలు
10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్‌లో 16, HYD సార్టింగ్ డివిజన్‌లో 12, HYD సౌత్ ఈస్ట్ డివిజన్‌లో 25, సికింద్రాబాద్ డివిజన్‌లో 62 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPMకు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT
Similar News
News October 12, 2024
HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన ఆమ్రపాలి కాట
GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఐకమత్యంతో శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత, సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. దసరా అందరికీ సుఖసంతోషాలను, శాంతిని, సుభిక్షాన్ని అందించాలని కమిషనర్ కోరారు.
News October 12, 2024
HYD: బంగారు మైసమ్మ సన్నిధిలో CP సీవీ ఆనంద్
దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పార్శీగుట్ట, మధురానగర్ కాలనీ బంగారు మైసమ్మను హైదరాబాద్ CP సీవీ ఆనంద్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీపీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి ప్రసాదం అందచేశారు. సీపీ నగర ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
News October 12, 2024
HYD: రేపు ఉప్పల్‌లో మ్యాచ్.. బజరంగ్ దళ్ నిరసన
రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్-బంగ్లా మ్యాచ్‌లో జెండాలతో బజరంగ్ దళ్ శాంతియుత నిరసన తెలియజేస్తుందని దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని, హిందువులపై దాడులు చేయడాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టినట్లు ఆయన వివరించారు. అంతేకానీ.. మ్యాచ్‌ను అడ్డుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.