News February 9, 2025

హైదరాబాద్‌ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

image

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం అన్నారు. రోడ్ల వెడల్పుపైనా పలు సూచనలు చేశారు.

Similar News

News February 9, 2025

HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!

image

నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్‌ చేశారు. 

News February 9, 2025

HYD: గురుమూర్తిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

image

మీర్ పేట్‌లో భార్యను అతికిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు మీర్ పేట పోలీసులు కష్టపడి పిటిషన్ వేసి విచారణ నిమిత్తం గురుమూర్తిని శనివారం 4రోజులు కస్టడీలోకి తీసుకోగా సరూర్ నగర్ సీసీఎల్ లేదా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది.

News February 9, 2025

HYD: నుమాయిష్@15.10 లక్షలు

image

HYD నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తారు. శనివారం వీకెండ్ కావడంతో సందర్శకులు పెద్దఎత్తున తరలిరావడంతో ఎగ్జిబిషన్ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. దాదాపు 80 వేల మంది సందర్శకులు శనివారం వచ్చారని నిర్వాహకులు తెలిపారు. జనవరి 3 నుంచి నిన్నటి వరకు ఎగ్జిబిషన్‌కు 15.10 లక్షల మంది సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

error: Content is protected !!