News August 13, 2024

హైదరాబాద్: బంద్‌కు పిలుపు.. భారీ స్పందన

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పలు సంఘాలు బంద్‌కు పిలుపునిస్తున్నాయి. సోమవారం హయత్‌నగర్‌, వికారాబాద్‌, కీసర తదితర చోట్ల భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. నేడు నగరంలోని‌ పలు డివిజన్‌ల బీజేపీ నాయకులు‌ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. నవాబుపేట, బొంరాస్‌పేటలో ఉదయం నుంచే అన్ని వ్యాపార వర్గాల వారు బంద్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.

Similar News

News October 31, 2025

BRS కేడర్‌కు నవీన్ యాదవ్‌ వార్నింగ్.. ECకి ఫిర్యాదు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని BRS ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. వారం రోజుల్లో బీఆర్ఎస్ కేడర్‌ను లేకుండా చేస్తానని నవీన్ యాదవ్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, కిషోర్ గౌడ్ తదితరులు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు.

News October 31, 2025

అజ్జూ భాయ్ ప్రమాణం.. అందరి చూపు ఈసీ వైపు!

image

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ నేత అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తోందని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో నేడు ఆయన ప్రమాణ స్వీకారంపై సందిగ్ధం నెలకొంది. అయితే మ.12.15 గం.కు ఆయన ప్రమాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో ఏం సమాధానం వస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

News October 31, 2025

HYDలో రోడ్డు భద్రతకు GHMC కొత్త యాప్‌

image

నగర రోడ్ల భద్రతకు GHMC యాప్ తీసుకొచ్చింది. ఫీల్డ్‌ ఇంజినీర్లు రోడ్ల పరిస్థితిని పరిశీలించి, సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడానికి ‘పీరియాడిక్‌ పబ్లిక్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్‌ యాప్‌’‌ స్టార్ చేసింది. ఇందులో పాత్‌హోల్స్‌, మాన్‌హోల్స్‌, రాళ్లు, ఓపెన్‌ ఎలక్ట్రికల్‌ బాక్స్‌లు, బ్యారికేడింగ్‌ సమస్యలు గుర్తించి జియోట్యాగ్‌ ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తారు. వాటిమీద యాక్షన్ తీసుకుంటున్నారా, లేదా తెలుసుకోవచ్చు.
SHARE IT