News August 13, 2024
హైదరాబాద్: బంద్‌కు పిలుపు.. భారీ స్పందన
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పలు సంఘాలు బంద్‌కు పిలుపునిస్తున్నాయి. సోమవారం హయత్‌నగర్, వికారాబాద్, కీసర తదితర చోట్ల భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. నేడు నగరంలోని పలు డివిజన్‌ల బీజేపీ నాయకులు ర్యాలీలో పాల్గొనాలని కోరారు. నవాబుపేట, బొంరాస్‌పేటలో ఉదయం నుంచే అన్ని వ్యాపార వర్గాల వారు బంద్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.
Similar News
News September 12, 2024
HYD: FREE వాటర్ పథకం.. ఇది మీ కోసమే!
గ్రేటర్ HYD పరిధిలో డొమెస్టిక్ యూజర్లు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా పథకం పొందేందుకు HMWSSB అధికారులు పలు సూచనలు చేశారు. పథకం పొందెందుకు ఆధార్ నెంబర్ CAN నంబర్‌తో లింక్ చేసుకోవడంతో పాటు, వాటర్ మీటర్ ఉండాలన్నారు. మురికివాడల్లో ఉన్న ప్రజలు కేవలం ఆధార్ లింక్ చేస్తే సరిపోతుందన్నారు. వాటర్ మీటర్ కనెక్షన్‌పై మినహాయింపు అందించినట్లు తెలిపారు. ఇందుకోసం స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించాలన్నారు.
News September 12, 2024
గణేశ్ నిమజ్జనం: HYDలో ‘రేపటి కోసం’
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.
News September 12, 2024
HYD సిటీలో రౌడీల భరతం పడతాం: సీపీ
HYD సిటీ పోలీస్ కమిషనరేట్ సీపీ CV ఆనంద్ నేడు మంత్రి సీతక్క, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన ఆనంద్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. HYD నగరంలో రౌడీల భరతం పడతామని, గంజాయి, డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. డ్రగ్స్ జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.