News August 13, 2024
హైదరాబాద్: బంద్‌కు పిలుపు.. భారీ స్పందన
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పలు సంఘాలు బంద్‌కు పిలుపునిస్తున్నాయి. సోమవారం హయత్‌నగర్, వికారాబాద్, కీసర తదితర చోట్ల భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. నేడు నగరంలోని పలు డివిజన్‌ల బీజేపీ నాయకులు ర్యాలీలో పాల్గొనాలని కోరారు. నవాబుపేట, బొంరాస్‌పేటలో ఉదయం నుంచే అన్ని వ్యాపార వర్గాల వారు బంద్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.
Similar News
News September 16, 2024
రేపే నిమజ్జనం.. ఖైరతాబాద్ గణేశ్ ఎంత బరువంటే?
70 టన్నుల ఖైరతాబాద్ గణేశ్ రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కాగా విగ్రహ తయారీ అప్పుడు 30 టన్నుల స్టీలు, గుజరాత్ గాంధీనగర్ నుంచి 35 కిలోల బరువున్న ప్రత్యేక మట్టి 1000 బ్యాగులు, 50 కిలోల బరువున్న 100 బండిళ్ల వరి గడ్డి, 10 కిలోల బరువున్న వరి పొట్టు 60 బస్తాలు, 10 ట్రాలీల సన్న ఇసుక, 2 వేల మీటర్ల గోనె బట్ట, 80 కిలోల సుతిలీ తాడు, 5 వేల మీటర్ల మెష్, 2500 మీటర్ల కోరా బట్ట, టన్ను సుతిలీ పౌడర్ వినియోగించారు.
News September 16, 2024
HYD: భారీ వాహనాలకు NO ENTRY, NO EXIT
HYD నగరంలో గణపతి నిమజ్జనం వేళ ఈ నెల 17న ఉ.6 నుంచి 18న ఉ.8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసులు తెలిపారు. ఇంట్రాసిటీ, ఇంటర్ సిటీ ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలకు ORR నుంచి HYD సిటీ లోపలికి ఎంట్రీ, ఎగ్జిట్ లేదని పోలీసులు వెల్లడించారు. గణపతి నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఆర్టేరియల్ రోడ్లు, ORR, సర్వీస్ రోడ్లలోనే ఉండాలని సూచించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.
News September 16, 2024
HYD: జానీ మాస్టర్‌పై కేసు.. నార్సింగి PSకు బదిలీ
జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నార్సింగి PSకు బదిలీ చేశారు. HYD సహా పలు నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని నివాసంలోనూ జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ డాన్సర్ (21) ఫిర్యాదు చేసింది. దీంతో రాయదుర్గం పోలీసులు జీరో FIR నమోదు చేసి తదుపరి విచారణకు నార్సింగి పోలీసులకు అప్పగించారు.పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు.