News July 19, 2024

హైదరాబాద్- బీజాపూర్ హైవేకు లైన్ క్లియర్

image

నిత్యం రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలతో నరకప్రాయంగా మారిన హైదరాబాద్- బీజాపూర్ హైవే విస్తరణ పనులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రహదారి విస్తరణకు సంబంధించి టెండర్ల ప్రక్రియ గతంలోనే పూర్తయిది. ఈ రోడ్డు పూర్తయితే హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది.

Similar News

News October 31, 2025

HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

image

రాజ్ భవన్‌లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్‌లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.

News October 30, 2025

RR : రేషన్ బియ్యం వేలం.. ఎక్కడో తెలుసా..?

image

జిల్లాలో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెరను సేకరించి అక్రమంగా వ్యాపారం చేసే వారి వద్ద నుంచి జప్తు చేసిన 947.496 MTల బియ్యం, 25.50 క్వింటాళ్ల గోధుమలు, 247కిలోల చక్కెర NOV18 న బహిరంగ వేలం వేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఎక్సైజ్ శాఖ ద్వారా అనుమతి పొందిన ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్ DCSO కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News October 30, 2025

కేశంపేట: భారీ వర్షానికి పాడైన బొప్పాయి తోట

image

మొంథా తుఫాన్ ప్రభావంతో కేశంపేటలో వ్యవసాయం దెబ్బతింది. తొమ్మిదిరేకులకి చెందిన పంది రామ్ రెడ్డి 4 ఎకరాలలో బొప్పాయి పంటను సాగు చేస్తున్నాడు. కాత పూత దశలో ఉన్న బొప్పాయి భారీ వర్షానికి నేలకొరిగింది. రూ.లక్షల పెట్టుబడి పెడితే అంతా నాశనం అయ్యింది సదరు రైతు వాపోయాడు.