News July 19, 2024
హైదరాబాద్- బీజాపూర్ హైవే విస్తరణకు లైన్ క్లియర్

నిత్యం రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలతో నరకప్రాయంగా మారిన హైదరాబాద్- బీజాపూర్ హైవే విస్తరణ పనులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రహదారి విస్తరణకు సంబంధించి టెండర్ల ప్రక్రియ గతంలోనే పూర్తయిది. ఈ రోడ్డు పూర్తయితే హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది.
Similar News
News November 13, 2025
HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 13, 2025
అగ్నిమాపక వ్యవస్థ.. గాంధీ ఆస్పత్రిలో అవస్థ

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నిమాపక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వేలమంది ఆస్పత్రికి చికిత్స కోసం వస్తుంటారు. వారి వెంట అటెండెంట్లు కూడా ఉంటారు. ఇక సిబ్బంది సరేసరి.. ఇంతమంది ఉన్నపుడు అంత పెద్ద భవనంలో అగ్నిమాపక వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 8 అంతస్తుల భవనంలో ఇప్పటికైనా పకడ్బందీగా ఫైర్ సేఫ్టీ సిస్టం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
News November 13, 2025
HYD: ఆస్పత్రికి వెళ్లాలంటే ‘కంటి’ పరీక్ష

సరోజినిదేవి కంటి ఆస్పత్రి.. రోజుకు కనీసం వెయ్యి మంది చికిత్సకు వస్తుంటారు. వీరంతా బస్సు దిగిన తర్వాత (మెహిదీపట్నం వైపు) రోడ్డు దాటాలంటే గుండెలు జారిపోతాయి. వందలాది వాహనాలు రోడ్లపై రయ్ మంటూ దూసుకెళుతుంటాయి. ఆ పరిస్థితుల్లో రోడ్డు దాటడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అసలే కంటి సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తుంటే.. ఈ రోడ్డెలా దాటాలి సారూ అని వాపోతున్నారు. ఓ వంతెన నిర్మించొచ్చు కదా అని కోరుతున్నారు.


