News March 20, 2025
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో రద్దీ

సమ్మర్ ఎఫెక్ట్‌తో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉ. అమీర్‌పేట స్టేషన్‌కు ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్‌ఫాం పూర్తిగా నిండిపోయింది. రాయదుర్గ్ రూట్‌లో వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. ట్రైయిన్‌లో కిక్కిరిసి ప్రయాణించారు. డ్యూటీకి వెళ్లేవారు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఎలా పోవాలి అయ్యా ఆఫీస్‌కి అంటూ ఓ నెటిజన్ @ltmhydని ప్రశ్నించారు. ఇకనైనా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.
Similar News
News April 24, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడి సంపులో పడి వ్యక్తి మృతి

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి సంపులో పడి మృతిచెందాడు. కాచిగూడకు చెందిన బి.బాలాజీ (48) కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ ఆలయానికి వచ్చాడు. అక్కడ నీటి సంపులో ఫోన్ పడిపోయింది. ఫోన్ తీసేందుకు యత్నించి సంపులో పడిపోయాడు. సిబ్బంది నిచ్చెన సాయంతో బాలాజీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News April 24, 2025
HYD: కాంగ్రెస్ పరిశీలకులు వీరే

కాంగ్రెస్ బుధవారం పరిశీలకులను నియమించింది. HYD, మేడ్చల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రంగారెడ్డికి సంబంధించి ఈ నియామకాలు జరిగాయి. HYDకు సురేశ్ కుమార్, సుబ్రహ్మణ్యప్రసాద్, ఖైరతాబాద్‌కు వినోద్ కుమార్, భీమగాని సౌజన్యగౌడ్, సికింద్రాబాద్‌కు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సిద్దేశ్వర్, రంగారెడ్డికి శివసేనారెడ్డి, సంతోష్ కుమార్, దారాసింగ్, మేడ్చల్‌కు పారిజాత నర్సింహారెడ్డి, కె.శివకుమార్‌లను నియమించింది.
News April 24, 2025
HYD: ఎండలు మండుతున్నాయ్.. 27 వరకు జాగ్రత్త!

HYD, RR, MDCL జిల్లాల పరిధిలో ఎండ 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతను దాటేసింది. ఇబ్రహీంపట్నం, MCపల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో నిన్న 40-42 డిగ్రీలవరకు నమోదైంది. 27వ తేదీ వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని TGDPS తెలిపింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సా.4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదని IAS అరవింద్ కుమార్ సూచించారు. గొడుగులు, టోపీలు వాడటంతో పాటు అధికంగా పానీయాలు తాగాలన్నారు.