News June 26, 2024
హైదరాబాద్: రాంగ్రూట్లో వెళితే చిక్కినట్లే!

హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాంగ్రూట్లో వెళితే ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ANPR(ఆటో మేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్డదారిలో వెళ్లిన వారి వాహనాలను గుర్తించి చలానాలు విధిస్తారు. IPC 336 సెక్షన్ కింద కేసు నమోదు చేయనున్నారు. SHARE IT
Similar News
News October 16, 2025
జూబ్లీహిల్స్లో బై‘పోల్’ పరేషాన్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది ఈసారేకాదు నియోజకవర్గం కొత్తగా ఏర్పడినప్పటి నుంచీ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో 56 శాతం, 2018లో 47.58 శాతం, 2023లో 45.59 శాతం పోలింగ్ జరిగింది. అంటే పదేళ్లలో దాదాపు 10 శాతం పడిపోయింది. మరి ఈసారి ఎంత శాతం నమోదవుతుందో చూడాలి.
News October 16, 2025
జూబ్లీబైపోల్: 3 రోజుల్లో 35 నామినేషన్లు.. 21 వరకు మరెన్నో?

జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు 3రోజుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో 35 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇంకా 21 వరకు టైమ్ ఉంది. అంటే ఈ రోజుతో కలిపి ఆరు రోజులన్నమాట. అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. విషయమేంటంటే ప్రధాన పార్టీల్లో BJP, కాంగ్రెస్ అభ్యర్థులు ఇంతవరకు నామినేషన్ వేయలేదు. ఒక్క BRS తప్ప. ఎంతమంది పోటీకి సిద్ధమవుతారో చూడాలి మరి.
News October 16, 2025
రంజీ DAY-2: పడ్డా.. తిరిగి నిలబడ్డ ఢిల్లీ

సొంతగడ్డపై జరుగుతున్న రంజీలో HYD, ఢిల్లీని ఆపలేకపోతోంది. ఓపెనర్ సాంగ్వాన్ 117*, ఆయూష్ దొసేజా 158* సెంచరీలతో అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 256/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ బ్యాటర్లు HYD బైలర్లను ఈజీగా ఎదుర్కొంటున్నారు. 2వ రోజు భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసేలా కనిపిస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత వికట్లు పడగొట్టి HYD నిలువరించగలదేమో చూడాలి. మిలింద్ 2, పున్నయ్ ఒక వికెట్ తీశారు.