News April 7, 2024
హైదరాబాద్: రోడ్ల మీద చెత్త వేస్తే FINE

ఇంటింటి చెత్త సేకరణను 100% విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నగరవాసులకు సూచించారు. స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వకుండా, రోడ్లపై పడేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. వారం రోజుల బస్తీ కార్యాచరణతో సాధ్యమైన ఫలితాలను వివరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి సమావేశాలతో 1,87,752 ఇళ్ల యజమానులు స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వట్లేదని.. ఇకనైనా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.
Similar News
News July 8, 2025
నాంపల్లిలో ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి

GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 5, 2025
HYD: ‘వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వీ కర్ణన్ అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News May 8, 2025
ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.