News June 29, 2024
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్లగా విస్తరణ: మంత్రి

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు త్వరలో టెండర్లు ఆహ్వానించేలా కసరత్తు చేయాలని, సెప్టెంబర్‌లో ఈ మేరకు పనులు ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారులపై హైటెక్ సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆయన మాట్లాడారు. ఇప్పటికే HYD-విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో జాప్యం చోటుచేసుకుందన్నారు.
Similar News
News October 25, 2025
HYD: డీఐ ఛేజింగ్.. ఎట్టకేలకు అతడు చిక్కాడు..!

HYD దుండిగల్ PS పరిధిలో ఖయ్యూం అనే వ్యక్తి ఒకరిని మోసం చేసి రూ.25 లక్షలను కాజేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో ఖయ్యూం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో డీఐ కిరణ్ సిబ్బందితో కలిసి వెళ్లాడు. పోలీసులను చూడగానే ఖయ్యూం రైలు పట్టాల మీదుగా పరిగెత్త సాగాడు. డీఐ కిరణ్, సిబ్బంది కలిసి అతడి వెంట పరిగెత్తి సినిమా స్టైల్‌లో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.
News October 25, 2025
ఓయూ: ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను నవంబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని ఆయన కోరారు.
News October 25, 2025
HYD: వస్త్రాల వ్యర్థాల రీసైక్లింగ్ అంతంతే..!

గ్రేటర్ HYDలో ఏటా సుమారుగా 15 టన్నులకు పైగా వస్త్రాలకు సంబంధించిన వ్యర్థాలు విడుదలవుతున్నాయి. కానీ.. వీటిని రీసైక్లింగ్, పునర్వినియోగం చేయడంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. కేవలం 14 శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నట్లుగా TGTRS తెలియజేసింది. రాబోయే రోజుల్లో ఈ శాతాన్ని మరింత పెంచడం కోసం కృషి చేస్తామని పేర్కొంది.


