News October 11, 2024
హైదరాబాద్-విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు
దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చే వాహనాలు జాతీయ రహదారిపై బారులు తీరాయి. దీంతో జాతీయ రహదారిపై టోల్ గేట్‌ల వద్ద అదనపు బూత్‌లు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. వాహనాల రద్దీ పెరగడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట నుంచి గన్నవరం వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది.
Similar News
News November 6, 2024
కోడూరు: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెండ్
కోడూరు శివారు నరసింహపురం ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వేణుగోపాలరావును విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈవో రామారావు ఉత్తర్వులు జారీ చేసినట్లు కోడూరు ఎంఈఓ రామదాసు తెలిపారు. తమ కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించి తొడపై కొరికాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటనపై విచారించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
News November 6, 2024
నూజివీడు త్రిపుల్ ఐటీలో 25 అంశాలలో పోటీల నిర్వహణ
నూజివీడు త్రిపుల్ ఐటీలో యువతరం కార్యక్రమం పేరిట సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, లలిత కళలు అనే ఐదు విభాగాల నుంచి 25 అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటి 8, శ్రీకాకుళం 6, ఇడుపులపాయ 5, ఒంగోలు త్రిపుల్ ఐటీలు 4 స్థానాల్లో అర్హత సాధించాయి. ఈ పోటీల్లో ఎంపికైన వారు వచ్చే నెల 26 నుంచి 30 వరకు కాంచీపురంలో నిర్వహించే సౌత్ జోన్ పోటీల్లో ఆర్జీయూకేటీ తరఫున పాల్గొననున్నారు.
News November 5, 2024
విజయవాడ: కాదంబరి జెత్వానీ కేసులో కీలక అప్డేట్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం ఈనెల 7కి వాయిదా వేసింది. విద్యాసాగర్‌ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విద్యాసాగర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.