News April 29, 2024
హైదరాబాద్ శివారులో చిరుత పులి (EXCLUSIVE)

హైదరాబాద్ శివారులో చిరుతపులి ఆనవాళ్లు లభించాయి. శంషాబాద్ విమానాశ్రయం ప్రహరీ వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా చిత్రీకరించిన ఫొటోలను అధికారులు విడుదల చేశారు. చిరుత కదలికలు రికార్డు అయ్యాయని వెల్లడించారు. ‘ఇప్పటికే బోన్‌లను ఏర్పాటు చేశాము.. త్వరలోనే చిరుతపులిని బంధిస్తాం’ అని ఫారెస్ట్ అధికారి విజయానంద్ తెలిపారు. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి.SHARE IT
Similar News
News April 18, 2026
HYDలో నేడు వీటిలోకి ఫ్రీ ఎంట్రీ

హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం సందర్శనకు నేడు ఫ్రీ ఎంట్రీ. నేడు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ అవశాన్ని నగరవాసులకు కల్పించింది. సాలార్జంగ్ మ్యూజియం, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ, పబ్లిక్ గార్డెన్స్, భువనగిరి ఫోర్ట్‌ను అందరూ ఫ్రీగా సందర్శించొచ్చు. మరిన్ని వివరాలకు గన్ ఫౌండ్రీలోని కార్యాలయాన్ని లేదా 040-23234942 నం.లో సంప్రదించొచ్చు.
News April 18, 2026
సికింద్రాబాద్ రక్షక శక్తికి 200 ఏళ్ల వైభవం

HYD సంస్థానంలో 1813లో కలరా మహమ్మారి విజృంభించిన సమయంలో అప్పయ్య చేసిన పవిత్ర మొక్కు నుంచి నేటి లష్కర్ బోనాల వైభవం వరకు ఉజ్జయిని మహంకాళి దేవాలయం అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. 1815లో కొయ్య విగ్రహంతో ప్రారంభమైన ఈ చారిత్రక క్షేత్రం, నగర ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడుతూ కోట్లాది మంది భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. అమ్మవారి దయుంటే అన్నీ జరిగుతాయని భక్తుల విశ్వాసం.
News April 18, 2026
HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందింది. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.


