News April 15, 2025

హైదరాబాద్ శివారులో చిరుతలు?

image

నగర శివారులోని ఇక్రిశాట్ క్యాంపస్‌లో సోమవారం సిబ్బందికి రెండు చిరుతల ఆనవాళ్లు కనిపించాయి. దీంతో సిబ్బంది వాటిని ఫొటో తీశారు. అయితే అవి నిజంగా చిరుతలా? లేక పెద్ద పిల్లులా? అని తేలాల్సి ఉందని ఇక్రిశాట్ అధికారులు తెలిపారు. అటవీ అధికారులను సంప్రదించి నిర్ధారిస్తామని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇక్రిశాట్ కమ్యూనికేషన్ హెడ్ తాహిర తెలిపారు.

Similar News

News October 28, 2025

శంకర్ మఠాన్ని సందర్శించిన రాంచందర్‌రావు

image

HYDలోని నల్లకుంట శృంగేరి శంకర్ మఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సందర్శించారు. శ్రీ శారదాంబ అమ్మవారిని దర్శించుకొని, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.

News October 28, 2025

HYD: హరీశ్‌రావు ఇంటికి KTR.. కార్యక్రమాలు రద్దు

image

హరీశ్‌రావు తండ్రి మరణించిన నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి బయలుదేరారు. పితృవియోగం కారణంగా ఈ రోజు జరగాల్సిన పార్టీ కార్యక్రమాలు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కోకాపేటలోని హరీశ్‌రావు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు చేరుకున్నారు.

News October 28, 2025

శంషాబాద్: మద్యం దుకాణాల లక్కీ డ్రాలో పాల్గొన్న కలెక్టర్

image

శంషాబాద్ పట్టణంలోని మల్లికా కన్వెన్షన్‌లో జరిగిన మద్యం షాపుల లక్కీ డ్రా కార్యక్రమానికి కలెక్టర్ నారాయణరెడ్డి హాజరయ్యారు. 249 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు. సరూర్‌నగర్ యూనిట్‌లో 138 రిటైల్ మద్యం దుకాణాలు, శంషాబాద్ యూనిట్ పరిధిలో మొత్తం 111 రిటైల్ మద్యం దుకాణాలకు ఎంపిక జరిగింది.