News June 24, 2024

హైదరాబాద్‌ శివారులో మాజీ MPTC హత్య

image

హైదరాబాద్ శివారు‌లో మాజీ MPTC హత్యకు గురయ్యారు. ఘట్‌కేసర్ PS పరిధిలో ఉండే మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదని ఆయన సోదరుడు విఠల్ PS‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా NFCనగర్‌ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహం గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 4, 2024

HYD నగరానికి మెగా మాస్టర్ ప్లాన్-2050

image

HYD నగర శివారులో రానున్న ఆర్ఆర్ఆర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ కన్సల్టెన్సీలతో మెగా మాస్టర్ ప్లాన్-2050 తయారు చేస్తోంది. దాదాపు 12 వేల చదరపు కిలోమీటర్ల మేర మొబిలిటీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నివాస ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. 2050 నాటికి నగరంలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళిక సైతం తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు.

News November 4, 2024

UPDATE.. HYD: వాష్ రూమ్‌లో అత్యాచారం!

image

వాష్ రూమ్‌కు వెళ్లిన 20 ఏళ్ల యువతిపై మార్ట్ సూపర్‌వైజర్ ఖాజాబషీర్ (35) అత్యాచారం చేసిన దారుణ ఘటన HYD ఘట్కేసర్ పీఎస్ పరిధిలో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. ఈ ఘటన నెల క్రితం జరిగింది. యువతి ఇటీవల కళ్లు తిరిగి పడిపోవడంతో పరీక్షలు నిర్వహించగా గర్భం దాల్చినట్లు తేలింది. యువతిని నిందితుడు బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. పోలీసులు కేసు నమోదు చేసి బషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News November 4, 2024

HYD: చెరువుల పునరుద్ధరణకు హైడ్రా స్టడీ టూర్..!

image

చెరువుల పునరుద్ధరణపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరుకు స్టడీ టూర్ వెళ్లనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా మరి కొంతమంది ఇందులో పాల్గొననున్నారు. అక్కడచెరువుల పునరుజ్జీవం ఎలా జరిగిందో స్టడీ చేస్తారు. ఈ టూర్ అనంతరం ఇక్కడకు వచ్చి బాచుపల్లిలోని ఎర్రకుంటచెరువు, మాదాపూర్ సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్‌లోని అప్పా చెరువుల పునరుద్ధరణ చేపడతారు.