News February 12, 2026
హైదరాబాద్–శ్రీశైలం రైల్వే లైన్‌కు సీఎం విజ్ఞప్తి

హైదరాబాద్–శ్రీశైలం–మార్కాపురం కొత్త రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని CM చంద్రబాబు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. శ్రీశైలానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు నేరుగా రైలు సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శ్రీశైలానికి మార్కాపురం స్టేషన్ 80 కి.మీ దూరంలో ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే పర్యాటక రంగంతో పాటు ఆర్థిక రంగం వృద్ధి చెందనుంది.
Similar News
News March 10, 2026
కొయ్యలగూడెం: ఈ నెల 25 నుంచి పొగాకు కొనుగోళ్లు

ఎన్ఎల్ఎస్ పరిధిలో వర్జీనియా పొగాకు వేలం కొనుగోళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్లు వేలం నిర్వహణ అధికారి శివకుమార్ తెలిపారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం1,2, దేవరపల్లి, గోపాలపురంలోని ఐదు కేంద్రాల్లో వేలం జరుగుతుందన్నారు. సుమారు 4,816 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్న 2,673 మంది రిజిస్టర్డ్ రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.
News March 10, 2026
గల్ఫ్ యుద్ధం.. నిజామాబాద్ వాసికి గాయాలు

గల్ఫ్ యుద్ధం కారణంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి గాయపడ్డారు. కమ్మర్‌పల్లికి చెందిన తిరుపతి ఉపాధి నిమిత్తం ఏడేళ్ల క్రితం ఇజ్రాయెల్ వెళ్లారు. ఇటీవల ఆయన విధుల్లో ఉండగా మిస్సైల్ దాడిలో శకలాలు ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నారు. తిరుపతిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని కుటుంబీకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
News March 10, 2026
ADB: కోటి మొక్కల సైన్యం.. క్షేత్రస్థాయిలో శూన్యం!

2015లో ప్రారంభమైన హరితహారం నుంచి వన మహోత్సవం వరకు మొక్కల పెంపకం అవినీతికి కేంద్రబిందువుగా మారిందనే విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటా కోటికిపైగా మొక్కలు నాటినట్లు అధికారులు గణాంకాలు చూపుతున్నా క్షేత్రస్థాయిలో వాటి ఉనికి లేదు. నిర్మల్- 400 నర్సరీల్లో 50లక్షల మొక్కలు, ADB-468 నర్సరీల్లో 30లక్షలు, ASF-334 నర్సరీల్లో 35లక్షలు, MNCL-311 నర్సరీల్లో 23లక్షల మొక్కలు పెంచుతున్నట్లు చెబుతున్నారు.


