News February 3, 2025
హైదరాబాద్, సికింద్రాబాద్‌కు కొత్త అధ్యక్షులు

తెలంగాణలో 27 జిల్లాల BJP అధ్యక్షులను ప్రకటించారు. హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి, సికింద్రాబాద్ మహంకాళి-భరత్ గౌడ్, మేడ్చల్ జిల్లాకు బీ.శ్రీనివాస్‌ను నియమించారు.
Similar News
News February 19, 2025
ప్రాజెక్టులకు కేంద్రం సహాయం కోరిన మంత్రి

రాజస్థాన్‌లో జరిగిన జాతీయ నీటిపారుదల మంత్రుల సదస్సులో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కార్యదర్శి దేవశీష్ ముఖర్జీతో బుధవారం భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం, PRLIS, సీతారామ, సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టుల నిధులు, మూసీ నది పునరుద్ధరణ, NDSA నివేదిక వేగంగా విడుదలపై కేంద్ర సహాయం కోరారు.
News February 19, 2025
రహమత్‌నగర్ ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్

రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీ రామ్ నగర్‌లోని గవర్నమెంట్ ఆస్పత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన దృష్టికి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తీసుకెళ్లారు. ఎస్పీఆర్ హిల్స్‌లోని క్వారీ ల్యాండ్, వాటర్ రిజర్వాయర్, స్టడీ సర్కిల్‌ని కూడా కలెక్టర్ సందర్శించారు.
News February 19, 2025
HYD: కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు.