News July 3, 2024
హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ఏటా పెరుగుతోన్న నష్టాలు!
రాష్ట్రంలో అత్యధిక నష్టాల్లో ఉన్న హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ఏటా నష్టాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 42.23 శాతం నష్టాలొచ్చాయి. 1013 మిలియన్ యూనిట్లు ‘లాస్ యూనిట్లు’గా టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది. 101 కోట్ల యూనిట్లు బిల్లింగ్‌లోకి రాలేదు. సగటు యూనిట్ ఖర్చు రూ.7 కాగా ఒక్క ఏడాదిలో రూ.707 కోట్లు ఖజానాకు గండిపడింది. దీంతో ఈ సర్కిల్‌ను ప్రైవేటుకు అప్పగించేందుకు సర్కారు సన్నద్ధం అవుతోంది.
Similar News
News December 9, 2024
HYD: సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తాం: బిర్లా గ్రూప్
రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నేర నియంత్రణ కోసం సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తామని ఆదిత్య బిర్లా గ్రూపు వైస్ ఛైర్మన్ రాజశ్రీ తెలిపారు. రాచకొండ సీపీ సుధీర్ బాబుతో సోమవారం రాజశ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, నేర నియంత్రణ విధానాలు, షీ టీమ్స్ పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
News December 9, 2024
HYD: వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
ఈనెల 20, 21 తేదీల్లో జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆహ్వానించారు. శాసనసభ ఆవరణలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన జానయ్య ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్సవాలకు హాజరు కావడంపై సీఎం సానుకూలంగా స్పందించారు.
News December 9, 2024
RR: టీకా వాహనాలను ప్రారంభించిన కలెక్టర్
సంచార టీకా ద్విచక్ర వాహనాలను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ వాహనాలు పల్లెలు, పట్టణాలు, జన సంచార ప్రాంతాలలోకి చేరుకొని పిల్లలు, గర్భిణీలకు నూరు శాతం టీకాలు ఇచ్చేందుకు దోహదపడతాయని చెప్పారు. డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, జిల్లా ఇమ్యు నైజేషన్ అధికారి షీభహయత్, డిప్యూటీ డిఎంహెచ్ఓ రాకేశ్, డీపీఓ అక్రమ్ పాల్గొన్నారు.