News April 11, 2024
హైదరాబాద్: BRS, కాంగ్రెస్, MIM ఒక్కటే: కిషన్ రెడ్డి

BRS, కాంగ్రెస్, MIM మూడు పార్టీలు ఒక్కటేనని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో అధికారంలో ఉన్న BRSకు మద్దతు ఇచ్చిన MIM ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తోందని విమర్శించారు. ఫిరోజ్‌ఖాన్ మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. వీళ్లంతా కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఏంటని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో BJPకే అత్యధిక స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు.
Similar News
News November 9, 2025
HYD: రమణీయం.. ఈ సూర్యాస్తమయం

బుగ్గజాతర రూట్లో ఇవాళ అద్భుతమైన దృశ్యం ఆకట్టుకుంది. తాటిచెట్ల మధ్య సూర్యాస్తమయం కనువిందు చేసింది. చల్లటి గాలులతో కూడిన వాతావరణం జనాలని కట్టి పడేస్తుంది. పట్టణం నుంచి వచ్చే వారు గ్రామీణ వాతావరణంలో ఆనందంగా గడిపేస్తున్నారు. బుగ్గ జాతరకు వెళ్తే జాపాల, ఆరుట్ల, తిప్పాయిగూడ గ్రామాల మీదుగా రాచకొండ ఫోర్ట్‌ను సందర్శించండి. ఈ రూట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అస్సులు మరిచిపోలేరు.
News November 9, 2025
శంషాబాద్: మూడు విమానాలు రద్దు

వివిధ గమ్యస్థానాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి HYD రావాల్సిన విమానం, జైపూర్ నుంచి HYD రావల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. అలాగే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.
News November 9, 2025
HYD: ఫ్రాన్స్‌లో MBBS పూర్తి చేసి ఉగ్రవాదం వైపు

ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వారిలో హైదరాబాదీ మొహియుద్దీన్ ఉండటం చర్చనీయాంశమైంది. నిందితుడిని రాజేంద్రనగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలోని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు ఫ్రాన్స్‌లో MBBS పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇంత చదివి ప్రజల ప్రాణాలు బలిగొనే ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండటంతో యువతరం ఏమైపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో సోదాలు చేయగా గన్స్ దొరికాయి.


