News January 16, 2025
హైదరాబాద్: PhD అడ్మిషన్స్-2025 నోటిఫికేషన్

OUలో 2025 PhD అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి నోటిఫికేషన్ విడుదైంది. JAN 24 నుంచి FEB 23 వరకు అభ్యర్థులు ఎలాంటి లేట్ ఫీ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2వేల లేట్‌ఫీతో FEB 24 నుంచి MAR 5 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కేటగిరీ-2 కింద భర్తీ చేయనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.
Similar News
News February 15, 2025
HYD: రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు.. వివరణ!

నల్గొండ (D) అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లను వేసినట్లు సోషల్ మీడియా ప్రచారంపై HYD జలమండలి స్పందించింది. ఇక్కడి నుంచి నీరు మహానగరానికి సరఫరా అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అయింది. కాగా స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. స్పెషల్ టీం నీటి పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలు లభించలేదని, ఆందోళన అవసరం లేదని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
News February 15, 2025
సంత్ సేవాలాల్ మహారాజ్‌కు నివాళులు అర్పించిన సీఎం

బంజారాజాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో వారి అధికారిక నివాసంలో సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
News February 15, 2025
HYD: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆర్జీలు వచ్చాయి. మొత్తం 1,233 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువ మంది ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం 974 ఆర్జీలు వచ్చాయని ప్రజావాణి కోఆర్డినేటర్ రాకేశ్ రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చామని తెలిపారు.