News October 13, 2024

హైదరాబాద్: PHOTO OF THE DAY

image

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను ఏకం చేసిన గొప్ప కార్యక్రమం అలయ్ బలయ్ అని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ హరియాణా గవర్నర్ బండారు దత్రాత్రేయ ఆలింగనం చేసుకున్నారు. అయితే, ఒకే వేదిక మీద రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, HYD BRS MLAలు ఉండడంతో PHOTO OF THE DAYగా నిలిచింది. అలయ్.. బలయ్‌ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొంది.

Similar News

News November 2, 2024

BREAKING: చర్లపల్లి జైలుకు ముత్యాలమ్మ గుడి నిందితుడు

image

సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడైన సల్మాన్ సలీంకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేయగా ఈ ఘటనపై సిట్ 3 కేసులను నమోదు చేసింది.

News November 2, 2024

HYD: యువతిపై అత్యాచారం

image

HYD ఘట్‌కేసర్ పరిధిలో యువతిపై అత్యాచారం జరిగింది. సీఐ పి.పరశురాం తెలిపిన వివరాలు.. ఓ మార్ట్‌లో పని చేసే యువతిపై కజా బషీర్ (35) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News November 2, 2024

ముషీరాబాద్‌‌లో 2 వేల కిలోల దున్నరాజు

image

ముషీరాబాద్‌లో గోలు టూ దున్నరాజు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని BRS నేత ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. నారాయణగూడ సదర్ సమ్మేళనంలో ఈ దున్నరాజుని ప్రదర్శించనున్నారు. గోలు టూ 7 అడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 2 వేల కిలోల బరువుతో భారీ ఆకారంలో‌ ఉంది. సాయంత్రం ముషీరాబాద్ నుంచి నారాయణగూడ వరకు‌ ర్యాలీగా వెళ్తారు. అక్కడి యాదవ సోదరులతో ‘అలయ్.. బలయ్’ తీసుకోనున్నట్లు హరిబాబు యాదవ్ తెలిపారు.