News March 12, 2025
హైదర్‌బాద్‌లో ఉరిసేకున్న ప.గో జిల్లా యువకుడు

ప్రేమ విపలం అవ్వడంతో ప.గో జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోడూరుకు చెందిన రోహిత్ కూమార్ ఓల్డ్ హఫీజ్ పేటలో స్నేహితులో కలిసి ప్రెవేట్ ఉద్యోగం చేస్తు జీవిస్తున్నాడు. మంగళవారం కలతగా ఉండటంతో ట్యాబెలెట్స్ వేసుకుని పడుకున్నాని చెప్పాడు. స్నేహితులు విధులు ముగించుకుని తిరిగి వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 19, 2026
ప.గో: కాలువలో మృతదేహం కలకలం

ఉండి మండలం ఎన్ఆర్‌పీ అగ్రహారం గ్రామ పరిధి చెరువుగట్టుపాలెం వద్ద గల పంట కాలువలో ఆదివారం ఒక గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News April 19, 2026
ప.గో జిల్లాలో ఎండు గడ్డికి పెరిగిన డిమాండ్

జిల్లాలో ప్రధానంగా డెల్టా, కొల్లేరు తీరప్రాంతాల్లో ఆక్వా చెరువులు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో పశుగ్రాసం, ముఖ్యంగా ఎండు గడ్డి కొరత పశు పోషకులను వెంటాడుతుంది. పశువుల పెంపకం కోసం ప్రస్తుత దాళ్వా మాసూళ్లు జరుగుతున్న క్రమంలో ధాన్యానికన్నా ముందుగానే ఎండు గడ్డిని ఒబ్బిడి చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఎండు గడ్డి ధర రూ.8-10వేలు పలుకుతోంది.
News April 19, 2026
భీమవరంలో చికెన్ ధర ఎంతంటే?

భీమవరంలో ఆదివారం మాంసం ధరలు ఆకాశాన్నంటాయి. బాయిలర్ కోడి కిలో రూ.300, ఫారం కోడి రూ.260కు చేరగా.. మటన్ ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది. గత రెండు రోజులతో పోలిస్తే చికెన్ ధరలు రూ.20 నుంచి రూ.40 వరకు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. చేపలు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి


