News November 14, 2024

హైవేపై టైర్ పంక్చర్.. పల్టీ కొట్టిన బొలెరో వాహనం

image

కంచికచర్ల మండల పరిధిలోని కీసర జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి నందిగామ వైపు వెళుతున్న బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. బొలెరో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, అతణ్ని ప్రభుత్వ ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. బండిలోని సరుకు రోడ్డుపై పడటంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Similar News

News October 25, 2025

నేడు కలెక్టరేట్‌లో వాహనాలకు నిషేధం

image

శబ్ద, వాయు కాలుష్య నివారణలో భాగంగా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీ శనివారం రోజున వాహనాలపై నిషేధం విధించారు. కలెక్టరేట్‌లో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా కాలినడకన లేదా సైకిల్‌పై విధులకు హాజరు కావాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఆ రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటువంటి మోటారు వాహనాలకు ప్రవేశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

News October 24, 2025

కృష్ణా జిల్లాలో వర్షపాతం వివరాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 46.2 మి.మీల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా గూడూరు మండలంలో 89.2 మి.మీల వర్షపాతం నమోదు అవ్వగా అత్యల్పంగా నాగాయలంక మండలంలో 19.6మి.మీల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News October 24, 2025

కృష్ణా జిల్లా DMHOగా బాధ్యతలు స్వీకరించిన డా. యుగంధర్

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(DMHO)గా డా. యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. DMHOగా బాధ్యతలు నిర్వర్తించిన డా. శర్మిష్ట గత నెల పదవీ విరమణ చేయగా ఆమె స్థానంలో యుగంధర్ నియమితులయ్యారు. ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడైన యుగంధర్ గతంలో గుడివాడ, అవనిగడ్డలో పని చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా కూడా పని చేశారు. నూతన DMHOను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.