News January 31, 2025
హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి: WGL కలెక్టర్

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతుల ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాట్ల కోసం భూ సేకరణకు పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ, సంగెం మండలం చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 1, 2025
అధ్యక్షా.. కడప – బెంగుళూరు రైలు రోడ్డు కథ కంచికేనా..?

మదనపల్లి జిల్లా కల నెరవేరింది. కడప- బెంగళూరు రైలు రోడ్డు వేస్తామని మరిచారు. అయితే ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన గళం వినిపించి కడప మదనపల్లి మీదుగా బెంగుళూరుకి రైల్వే రోడ్డుకు కృషి చేస్తారా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజంపేట పరిధిలో బస్ షెల్టర్ల ఏర్పాటుపై చర్చించి, గతంలో మంజూరైన రైల్వే రోడ్డు, బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తారా? చూడాలి.
News December 1, 2025
NGKL జిల్లాలో తగ్గిన చలి

నాగర్కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.1°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 18.3°C, తోటపల్లిలో 18.5°C, ఊర్కొండ, వెల్దండలలో 18.6°C, తాడూరులో 18.7°C, చారకొండ మండలంలో 18.8°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


