News January 31, 2025

హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి: WGL కలెక్టర్

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతుల ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాట్ల కోసం భూ సేకరణకు పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ, సంగెం మండలం చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 22, 2025

ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

image

ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

News November 21, 2025

నర్సంపేట: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

image

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పట్టణంలోని అంగడి సెంటర్‌లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటో నడుపుతున్న పట్టణానికి చెందిన మేకల మహేందర్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మహేందర్‌ను నర్సంపేట న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.

News November 21, 2025

బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశించారు. 6 నుంచి 14, 15 నుంచి 19 ఏళ్ల బడి బయటి పిల్లల వివరాలను ప్రబంధ్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, టెక్స్‌టైల్ పార్కుల్లో పనిచేసే కుటుంబాల పిల్లలకు పని ప్రదేశంలోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.