News January 31, 2025

హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి: WGL కలెక్టర్

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతుల ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి తెలిపారు. ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాట్ల కోసం భూ సేకరణకు పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ, సంగెం మండలం చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 9, 2025

పెరుగుతున్న చలి.. వచ్చేవారం మరో అల్పపీడనం

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో నిన్న 14.5 డిగ్రీలు, చాలా జిల్లాల్లో 20-25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు వచ్చేవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయన్నారు.

News November 9, 2025

ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

image

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News November 9, 2025

కార్తీకంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం?

image

దీప దానం చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది.
అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
వస్త్ర దానం వల్ల శివానుగ్రహం కలుగుతుంది.
స్వయంపాకం దానమిస్తే గౌరవం పెరుగుతుంది.
ఉసిరికాయలు దానం చేస్తే శుభం కలుగుతుంది.
గోదానంతో కృష్ణుడి కృప మీపై ఉంటుంది.
తులసి దానం చేస్తే మోక్షం లభిస్తుంది.
ధన దానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
పండ్లను దానం చేస్తే సంతానం కలుగుతుంది.